భారత్ విశ్వ విజేతగా అవతరించింది. అండర్-19 ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ లో జయభేరీ మోగించింది. ఫైనల్ లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మన బౌలర్ల ధాటికి 82 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు అమ్మాయి త్రిష(33 బంతుల్లో 44 నాటౌట్) దూకుడుగా ఆడటంతో భారత్ 11.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
19 ఏళ్ల తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచ్ లలో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144 గా ఉండటం విశేషం. కేవలం బ్యాటింగ్ లోనే కాదు.. బౌలింగ్ లోనూ సత్తా చాటి 7 వికెట్లు తీశారు. భద్రాచలం కు చెందిన త్రిష ఈ వరల్డ్ కప్ ఓపెనర్ గా వచ్చి 4, 27, 49, 40, 110, 35 రన్స్ చేశారు.