ఇంగ్లాండ్ తో టీ-20 సిరీస్ కు భారత జట్టు ఎంపిక చేసింది. జనవరి 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నుంచి షమీ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు టీ-20 జట్టు నుంచి రిషబ్ పంత్ ను తప్పించారు. ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు.
జనవరి 22 నుంచి టీ-20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ-20 సిరీస్ లో తొలి మ్యాచ్ 22న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరుగనుంది. రెండో మ్యాచ్ జనవరి 25న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగనుంది. మూడో మ్యాచ్ జనవరి 28న రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనుంది. జనవరి 31న పూణెలో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నాలుగో టీ-20, ఫిబ్రవరి02న ముంబైలోని వాంఖడే స్టేడియంలో 5వ టీ-20 జరుగనుంది.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).