ఐసీసీ ర్యాంకుల్లో దూసుకెళ్లిన భారత యువ క్రికెటర్లు

-

టీమ్ ప్రపంచ కప్ ముంగిట భారత క్రికెటర్లకు ఉత్సాహాన్ని ఇచ్చేలా ఐసీసీ ర్యాంకుల్లో ప్రతిభ చూపారు. భారత యువ క్రికెటర్లు అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకుల్లో ముందుకొచ్చారు. టీ-20 ఫార్మాట్ లో తాజాగా ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. అక్షర్ పటేల్ (660 పాయింట్లు) ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో ర్యాంకుకు చేరాడు. అర్ష్ దీప్ సింగ్ మూడు స్థానాలు పైకి ఎగబాకీ 16వ ర్యాంకును అందుకున్నాడు. ఈ జాబితాలో రవి బిష్ణోయ్ (659) ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇక టీ-20 బ్యాటింగ్ విభాగంలో మాత్రం సూర్య కుమార్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు 861 పాయింట్లతో తొలి ర్యాంకులో నిలిచాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ 788, రిజ్వాన్ 769, బాబర్ ఆజామ్ 761, మార్ క్రమ్ 733 టాప్ 5లో ఉన్నారు. భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ 714 ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని ఆరో ర్యాంకుకు చేరాడు. ఆల్ రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి టాప్ 5లో ఎవ్వరూ కూడా లేకపోవడం గమనార్హం. శ్రీలంక క్రికెటర్ హసరంగ 228 టాప్ ర్యాంకర్. వరల్డ్ కప్ లో భారత జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య 185 ఒక్కడే ఆరో స్థానంలో నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version