ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్లు ఇమామ్ ఉల్ హుక్ 10, బాబార్ అజామ్ 23, 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సౌద్ షకీల్, రిజ్వాన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో పాక్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. చివరలో కుప్ దిల్ షా 38 పరుగులు చేశాడు. రెండు సిక్స్ లతో విరుచుకుపడ్డాడు.
కెప్టెన్ రిజ్వాన్ 46 పరుగులు చేయగా.. షకీల్ 62 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ షమీ వికెట్ తీయకుండా పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2, జడేజా, రానా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 49.4 బంతుల్లో పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. భారత్ కి 242 పరుగుల టార్గెట్ లక్ష్యం నిర్దేశించింది.