ఐపీఎల్ లో 2012 సంవత్సరంలో ఇదే రోజున చెన్నై మరియు ముంబై జట్ల మధ్యన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఖరి బంతి వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్ లో చివరికి ముంబై నే విజయం వరించింది. ఈ మ్యాచ్ లో ముంబై ముందు చెన్నై 174 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది . ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో విజయాన్ని సాధించాలి అంటే ఆఖరి మూడు బంతుల్లో 14 పరుగులు సాధించాల్సి ఉంది. ఆ క్షణం ఎవ్వరైనా విజయం ఎవరిది అంటే… ఖచ్చితంగా నూటికి నూరు మంది చెన్నై దే అంటారు. కానీ ఆ క్షణం అంచనాలన్నీ తలకిందులు చేస్తూ వెస్ట్ ఇండీస్ కు చెందిన ఆల్ రౌండర్ డ్వెన్ స్మిత్ వరుసగా మూడు బంతుల్లో బౌండరీలు బాధి అపూర్వ విజయాన్ని ముంబై ఇండియన్స్ కు అందించి సంచలనంగా మారాడు.
అభిమానులకు గుర్తొస్తోన్న 2012 “చెన్నై – ముంబై” మ్యాచ్… !
-