IPL 2023 : సిరాజ్ తో బెట్టింగ్ డీల్ !

-

ఇండియా – ఆస్ట్రేలియా వన్డేలో ఫిక్సింగ్‌కు ప్రయత్నాలు జరిగిన ఘటన కలకలం సృష్టిస్తుంది. ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్ సిరాజ్‌ను సంప్రదించాడు ఏపీకి చెందిన వ్యక్తి. బెట్టింగ్‌లో చాలా డబ్బు పోగొట్టుకున్నానని సిరాజ్‌కు చెప్పాడు పంటర్‌ అనే వ్యక్తి. తనను ఆదుకోవాలని సిరాజ్‌ను వేడుకున్న పంటర్‌.. సిరాజ్‌ వాట్సాప్‌కు మెసేజ్‌లు పంపాడు.

దీంతో ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్‌ దృష్టికి తీసుకువెళ్లాడు సిరాజ్‌. దీంతో సిరాజ్‌కు మెసేజులు పంపిన పంటర్‌ను పట్టుకుంది బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్. పంటర్‌ హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు. పంటర్‌కు ఏ గ్యాంగ్‌తో సంబంధాలు లేవని గుర్తించారు పోలీసులు. ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్‌ మార్చి 19న వైజాగ్ లో జరిగింది. ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో ఉన్నాడు పంటర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version