OCD అంటే ఏంటి..? ఈ లక్షణాలు ఉంటే ఈ సమస్య ఉన్నట్టే..!

-

OCD గురించి చాలామంది చాలా విని ఉంటారు. కానీ అసలు OCD అంటే ఏంటి..? సినిమాల్లో చూపించినట్లు ఉంటుందా..? దీని లక్షణాలు ఎలా ఉంటాయి..? ఈ విషయాల గురించి చూద్దాం. ఓసీడీ అంటే అబ్ససివ్ కంపల్సివ్ డిసార్డర్. పదేపదే చేతులు కడుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు కేవలం శుభ్రత పై మాత్రమే ఆలోచించరు. అదుపులేని ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. వీటిని అబ్సెషన్స్ అని పిలుస్తారు. ఈ ఆలోచన కారణంగా పనులు చేయడమే బలవంతం అంటూ ఉంటారు. OCD ముఖ్య లక్షణం ఏంటంటే మళ్లీ మళ్లీ చెక్ చేయడం. ఈ ఓసీడీలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్లీనింగ్. ఇంకొకటి చెకింగ్.

క్లీనింగ్ విషయానికి వస్తే.. కడిగిందే మళ్ళీ కడగడం.. చేతుల్ని మళ్ళీ మళ్ళీ కడుక్కోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అదే చెకింగ్ అనుకోండి తాళాలు వేసామా లేదా అని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే ఇంటికి ఎవరైనా వచ్చారేమో అని మళ్లీ మళ్లీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఏ విషయాన్నైనా సర్రే. క్లీనింగ్ చేయడమే కాదు వస్తువులు కూడా ఆర్డర్లో పెట్టుకోవాలని ఒక చోటను వస్తువులు ఇంకోచోట పెడితే ఇబ్బందిగా ఉంటుంది.

అలాగే ఎప్పుడు పడితే అప్పుడు చేతులు కడుగుతూనే ఉంటారు. అలాగే ఒకరితో మాట్లాడేటప్పుడు అనుకోకుండా ఆలోచనలు వస్తాయి. కంట్రోల్ చేసుకోలేని లైంగిక ఆలోచనలు లేదా ప్రైవేట్ పార్ట్స్ చూడాలని ఆలోచనలు రావడం వంటివి కలుగుతాయి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వారికి ఏదో ప్రమాదం ఉన్నట్లు ఏమైనా జరుగుతుందేమో అని మరణం గురించి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓసీడీ ఉంటే నిద్ర, భయం, అనారోగ్యం, డిప్రెషన్ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య ఉన్నట్లయితే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version