ఐపీఎల్ లో ఆడుతున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విధంగా ఏదో ఒక విభాగంలో మంచి ప్రదర్శన కనబరిచి ది బెస్ట్ ప్లేయర్ గా నిలవాలని ఉంటుంది. అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ కు ఆరెంజ్ క్యాప్ ను అందిస్తారు. అదే విధంగా అత్యధిక వికెట్లను తీసుకున్న బౌలర్ కు పర్పుల్ క్యాప్ ను అందిస్తారు. అందుకే బౌలర్లు మరియు బ్యాట్స్మన్ లు ఇద్దరూ కూడా ఎంతో కృషి చేసి ఈ క్యాప్ లను అందుకోవాలి అనుకుంటారు. కాగా తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో ఇప్పటి వరకు చూసుకుంటే ఆరంజ్ క్యాప్ ను అందుకునే వారిలో డుప్లిసిస్ మొదటి స్థానంలో ఉండగా, పర్పుల్ క్యాప్ ను అందుకునే వారిలో రషీద్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా కోల్కతా నైట్ రైడర్స్ కు చెందిన ఒక యంగ్ ప్లేయర్ రింక్ సింగ్ మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో పరుగులు సాధిస్తూ ఇప్పుడు అత్యధిక పరుగులు సాధించిన లిస్ట్ లో టాప్ 8 కు దూసుకువచ్చాడు.