IPL 2024: ముగిసిన లీగ్ దశ.. ప్లే ఆఫ్ మ్యాచ్ ల వివరాలు ఇవే

-

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, Qualifier 1: ఐపీఎల్ 2024లో లీగ్ దశ మ్యాచ్ 21 నుంచి నాకౌట్ మ్యాచ్ లకు తెర లేవనుంది. KKR, SRH, రాజస్థాన్, RCB ప్లేఆఫ్స్ కి చేరాయి. మే 21న అహ్మదాబాద్ లో జరగనున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో KKR, SRH, మే 22న ఎలిమినేటర్ లో RCB, రాజస్థాన్ పోటీపడతాయి.

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, Qualifier 1

మే 24న క్వాలిఫైయర్-2లో ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టుతో తలపడుతుంది. మే 26న చెన్నైలోని చెపాక్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, వర్షం కారణంగా KKR, RR మ్యాచ్ రద్దయింది. టాస్ అనంతరం మరోసారి వర్షం మొదలడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో టేబుల్ లో 20 పాయింట్లతో KKR టాప్ ప్లేస్ లో ఉండగా…. SRH 17(నెట్ రన్ రేట్+0.414), RR 17(నెట్ రన్ రేట్+0.273), RCB(14 పాయింట్లు) 2,3,4 స్థానాల్లో నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version