ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. నేడు ఐపీఎల్ మినీవేలం జరగనుంది. మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి ఆక్షన్ ను విదేశాల్లో నిర్వహిస్తున్నారు. దుబాయ్ లోని కోకాకోలా అరీనా దీనికి వేదిక కానుంది. తొలిసారిగా మహిళా ఆక్షనీర్ వేలం నిర్వహించనున్నారు. అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 38.14 కోట్లున్నాయి. 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.
ఈరోజు దుబాయ్ లో జరిగే ఐపీఎల్ 2024 వేలం పాటలో పాల్గొనేందుకు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ సిద్దమయ్యారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొంతకాలంగా క్రికెట్ కి దూరమైన పంత్ ఈ వేలం పాటలో మళ్లీ క్రికెట్ జర్నీ మొదలుపెట్టనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్….వేలంలో ఆ జట్టు తరపున ఆటగాళ్ల ఎంపికలో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పంత్ కోలుకుంటారని జట్టు భావిస్తుంది.