ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జాస్ బట్లర్ తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. “రెస్ట్ ఇన్ పీస్ డాడ్.. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్” అని జాస్ బట్లర్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. తన తండ్రితో కలిసి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫోటోను జాస్ బట్లర్ షేర్ చేసుకున్నారు. అయితే తన తండ్రి మరణానికి గల కారణాలను వెల్లడించలేదు.

తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని జాస్ బట్లర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మీ తండ్రి మరణించినప్పటికీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మీకు ఉంటాయి బట్లర్ ధైర్యంగా ఉండాలని అతని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా…. ఇంగ్లాండ్ జట్టులో జాస్ బట్లర్ స్టార్ ఆటగాడిగా కోనసాగుతున్నారు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.