ఇండియా-సౌతాఫ్రికా టీ20 రద్దు..ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్ చెప్పిన కర్ణాటక క్రికెట్

-

టీ మిండియా, సఫారీల మధ్య ఆదివారం రాత్రి జరిగిన చిట్ట చివరి టీ 20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 3.3 ఓవర్లు ముగిసే సమయానికి 28/2 తో నిలిచిన దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో.. మ్యాచ్‌ ను ఫీల్డ్‌ అంపైర్లు రద్దు చేశారు.

దీంతో ఐదు టీ 20 ల సిరీస్‌ 2-2 తో ముగిసింది. అయితే.. ఈ మ్యాచ్‌ రద్దు అయినప్పటికీ.. ఫ్యాన్స్‌ కు మాత్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది కర్ణాటక క్రికెట్‌ బోర్డు. అయితే.. ఈ మ్యాచ్‌ రద్దు కావడంతో.. టికెట్టు లోని 50 శాతం డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని.. కర్ణాటక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయిందని.. ఇది చాలా దురదృష్టకరమని.. అందుకే తాము టికెట్టు లోని 50 శాతం డబ్బులను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version