ఐపీఎల్ 2025 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో రసవత్తర ఫైట్ జరగబోతుంది. టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్.. కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య… ఇవాళ మ్యాచ్ జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన జట్టు… విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఈ మ్యాచ్ కు టాస్ చాలా కీలకంగా మారనుంది. కాగా IPL 2025లో భాగంగా KKRతో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. SRH యువ హిట్టర్ అనికేత్ వర్మ గాయపడినట్లు సమాచారం. నేడు కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో అనికేత్ వర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. నెట్‌బౌలర్ వేసిన బంతి అతని కాలి బొటన వేలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది.