వాళ్ళు చాలా మంచోళ్ళు అన్న కోహ్లీ…!

-

స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీం ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ లో అడుగుపెట్టింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా కీవీస్, భారత్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆసీస్ తో జరిగిన వన్డే సీరీస్ ని దక్కించుకున్న టీం ఇండియా ఇప్పుడు కివీస్ పర్యటనను కూడా విజయ౦తో మొదలుపెట్టాలని భావిస్తుంది.

ఈ నేపధ్యంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేసాడు. న్యూజిలాండ్ జట్టు గురించి మాట్లాడుతూ కివీస్ మంచి జట్టు అంటూ కొనియాడాడు. ఐసీసీ ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో టీం ఇండియా, న్యూజిలాండ్‌ చేతిలో టీం ఇండియా ఓడిపోయింది. జూలై 2019లో మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఆ మ్యాచ్ ఓటమితో ప్రపంచకప్ లో టీం ఇండియా ప్రస్తానం ముగిసింది. ఈ నేపధ్యంలో ఈ పర్యటన కివీస్ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవడానికి అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ మైదానంలో పోటాపోటీగా ఉండాలని, అంతర్జాతీయ స్థాయిలో ఒక జట్టు ఎలా ఉండాలి అనడానికి వాళ్లు ఓ మంచి ఉదాహరణ అన్నాడు. వాళ్లు ప్రపంచకప్ ఫైనల్‌కి వెళ్లినందుకు మేము ఎంతో సంతోషించామని, మనము ఓడితే గెలిచిన వాళ్లను అభినందించాలి. కానీ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన రావొద్దన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version