ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ… లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెంట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టును చిత్తుచిత్తు చేసింది లక్నో సూపర్ జెంట్స్.

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే హైదరాబాద్ జట్టుపై చేదించింది లక్నో సూపర్ జెంట్స్. దీంతో హైదరాబాద్ పై ఐదు వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది.