IPL 2024 నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ ఔట్‌

-

IPL 2024 : బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఈ నెల 19న జరగనున్న వేళలో పాల్గొనేందుకు అతడు తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. ఐపీఎల్-16లో కేకేఆర్ కు ప్రాతినిధ్యం వహించిన షాకీబ్ కొన్ని మ్యాచులే ఆడారు.

No more IPL for Shakib! Bangladesh star keen on extending international career

గాయంతో సగం టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన అతడు విదేశీ లీగ్ లకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 71 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అతడు 793 పరుగులు, 63 వికెట్లు తీశారు.

కాగా, ఈనెల 19న దుబాయ్ లో ఐపీఎల్ వేలం జరగనుంది. మొత్తం 10 జట్లలో 77 స్థానాలు ఖాళీగా ఉండగా….. 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. అత్యధికంగా కోల్కత్తాలో 12 ఖాళీలు ఉండగా…. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ (9) ఉంది. ముంబై, గుజరాత్, పంజాబ్ లో ఎనిమిదేసి చొప్పున….చెన్నై, లక్నో, బెంగళూరు, హైదరాబాద్ లో ఆరు చొప్పున ఖాళీలు ఉన్నాయి. అన్ని జట్ల పర్స్ వ్యాల్యూ రూ. 262.95 కోట్లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version