హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌.. 2700 మంది పోలీసులతో సెక్యూరిటీ

-

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 కోసం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక 23వ తేదీన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 2700 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు రాచకొండ కమిషనర్ తెలిపారు.

‘ఉప్పల్‌ స్టేడియంలో 450 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్‌ రూమ్ పెట్టి ఏసీపీ సారథ్యంలో భద్రతను పర్యవేభిస్తాం. స్టేడియం ఎంట్రన్స్‌ వద్ద స్నిపర్‌ డాగ్స్‌, బాంబ్‌ స్క్వాడ్‌ రెడీగా ఉంచాం.  క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చే మహిళల కోసం షీటీమ్స్ కూడా అలర్ట్ చేశాం. క్రికెట్  అభిమానుల కోసం ఐదు చోట్ల ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశాం. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్‌టాప్‌, అగ్గిపెట్టెలు, పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులను నిషేధించాం’ అని రాచకొండ పోలీసు కమిషనర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version