తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజ్, కరీంనగర్‌లో లా కాలేజ్ మంజూరు చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే.
దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు.