చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి.. ఇండియన్ స్టార్ ప్లేయర్ ప్రజ్ఞానంద

-

ఇండియన్ యంగ్ చెస్ ఛాంపియన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు ఫాబియానో కరువానాపై గెలిచిన ప్రజ్ఞానంద.. తుదిపోరులో ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో తాడోపేడో తేల్చుకోనున్నాడు.

హోరాహోరీగా సాగిన సెమీస్‌లో మొదటి నుంచి అగ్రశ్రేణి ఆటగాడైన అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ కరువానాకు గట్టి పోటీనిచ్చిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద.. టైబ్రేక్‌లోనూ పట్టు వదలకుండా పోరాడాడు. సోమవారం రోజున టైబ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. రసవత్తరంగా సాగిన గేమ్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో కరువానాపై నెగ్గాడు. ఈ విజయంతో 2024 క్యాండిడేట్‌ టోర్నీలో చోటు ఖాయం చేసుకున్న ప్రజ్ఞానంద.. బాబి ఫిషర్‌, కార్ల్‌సన్‌ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు

‘‘ప్రజ్ఞానంద ఫైనల్‌ చేరాడు. టైబ్రేక్‌లో కరువానాను ఓడించాడు. ఇక కార్ల్‌సన్‌తో తలపడనున్నాడు. ఆహా.. ప్రజ్ఞానందది ఎంత గొప్ప ప్రదర్శన’’ అని ఆనంద్‌ ట్వీట్‌ చేశాడు. కార్ల్‌సన్‌తో టైటిల్‌ పోరులో భాగంగా మంగళవారం తొలి గేమ్‌ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version