టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. క్రేజీ రికార్డు సంపాదించాడు. కారు ప్రమాదం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్… ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అద్భుత ప్రదర్శన కనపరిచాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆరవ స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మొదటి టెస్టులో పంత్ అద్భుతంగా ఆడాడు. ఈ తరుణంలోనే.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో పంత్ దూసుకు వెళ్ళాడు.
అటు మూడవ ర్యాంకులో యశస్వి జైస్వాల్ నిలిచాడు. కానీ విరాట్ కోహ్లీని అధిగమించి రిషబ్ పంత్… చరిత్ర సృష్టించాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ఆరవ ర్యాంకు దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో… టాప్ టెన్ లో ఇండియన్ ప్లేయర్స్ ముగ్గురు ఉన్నారు. అందులో మూడవ ర్యాంకులో యశస్వి జైష్వాల్ ఉంటే ఆరవ స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. 8వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు.