టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. టీం నుంచి కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించారు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న 5వ టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ ను కాదని.. బుమ్రాకు బాధ్యతలు ఇచ్చారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో… కేఎల్ రాహుల్ ఓపెనర్ వెళ్లాడు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న 5వ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన బుమ్రా.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయింది. 57 పరుగులకే జైశ్వాల్, కేఎల్ రాహుల్, గిల్ ముగ్గురూ ఔట్ అయ్యారు. అటు.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో రోహిత్ శర్మను జట్టు నుండి తొలగించి.. బుమ్రాను కెప్టెన్ చేయడంపై ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు.