మాములుగా ఒక్కో సంవత్సరం ఒక్క దేశంలో ఆసియా కప్ ను నిర్వహించడానికి ఆసియా కప్ కౌన్సిల్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ సంవత్సరం జరగనున్న ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉంది. కానీ ఇండియాకు పాకిస్తాన్ కు మధ్యన సత్సంబంధాలు లేని కారణంగా ఇండియా అక్కడ ఆడమని తేల్చేసింది. ఇందుకు ప్రత్యమ్నాయంగా కౌన్సిల్ యూఏఈ లో భారత్ ఆడే మ్యాచ్ లను జరిపించడానికి ప్లాన్ చేశారు. అయితే ఇందుకు ఇతర జట్లు అంగీకరించకపోవడంతో శ్రీలంకకు ఈ టోర్నీని తరలించారు. దీనితో శ్రీలంక ఈసారి ఆసియా కప్ ను నిర్వహించడానికి సిద్ధం అవుతోంది.
షాకింగ్: ఆసియా కప్ 2023 నుండి పాకిస్తాన్ దూరం ?
-