ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మరికొన్ని రోజులలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే మినీ వేలం కూడా పూర్తి అయ్యింది. అటు కీలక ప్లేయర్ లందరూ…. ఐపీఎల్ టోర్నమెంట్ కోసం సిద్ధమవుతుంటే… మరికొందరు ట్రేడింగ్ లో భాగంగా ఇతర జట్లకు వెళ్లారు. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్ గురించి ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. టాటా గ్రూప్ సంస్థ ఐపిఎల్ టైటిల్స్ స్పాన్సర్ గా… మరో నాలుగు ఏళ్ల పాటు కొనసాగనుంది.
మొదట 2022 మరియు 2023 రెండు సంవత్సరాల పాటు టాటా సంస్థ ఐపిఎల్ టైటిల్స్ స్పాన్సర్ గా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తాజాగా 2028 వరకు ఈ ఒప్పందాన్ని పొడిగించినట్లు తెలుస్తోంది. దీనికోసం టాటా ఏటా… 500 కోట్లు బీసీసీఐ పాలకమండలికి చెల్లించనున్నట్లు తెలుస్తోంది.అంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కుల కోసం ప్రతి సీజన్ కి 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనున్న టాటా గ్రూప్.. 2024-2028 వరకు 5 సంవత్సరాల కాలంలో 2500 కోట్లు బీసీసీఐకి చెల్లించడానికి టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది.