Rishabh Pant: రిషబ్‌ పంత్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన గంభీర్‌!

-

Rishabh Pant: రిషబ్‌ పంత్‌ కు బిగ్‌ షాక్‌ ఇవ్వబోతున్నారట టీమిండియా కొత్త కోచ్‌ గంభీర్‌. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న రిషబ్ పంత్‌కు శ్రీలంకతో ఈ నెలాఖరున జరిగే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. పంత్‌ నాన్‌స్టాప్‌గా ఆడుతున్నాడని భావిస్తున్న సెలక్షన్ కమిటీ అతడికి రెస్ట్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు పంత్‌ను పూర్తి సిద్దంగా ఉంచేందుకు రెస్ట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Team India’s new coach Gambhir is going to give Rishabh Pant a big shock.

ఇక అటు టీ20లకు టీమిండియా కొత్త కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ బాధ్యతలు చేపడతారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా పేరు వినిపించగా… ఇప్పుడు స్కై పేరు బలంగా వినిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌ గెలుపుతో రోహిత్ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌ల్లో కెప్టెన్‌గా చేసిన సూర్యనే కెప్టెన్‌ను చేయాలని కోచ్‌ గంభీర్, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అగార్కర్‌ భావిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version