ఉత్కంఠపోరులో టీమిండియా విజయం

-

వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా మ్యాచ్ మ్యాచ్ కి మెరగవుతోంది. అజెయ రికార్డును కొనసాగిస్తూ వరుసగా ఐదో మ్యాచ్ లో విజయాన్ని సాధిస్తుంది. ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ని టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి రుచి చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 87 బంతుల్లో 75 పరుగులు చేశాడు.

టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 5 వికెట్లు తీసిన షమీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. 48 ఓవర్లలో భారత్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ 40 బంతుల్లో 46 పరుగులు చేశాడు. టీమిండియా ఆలౌండర్ రవీంద్ర జడేజా 44 బంతుల్లో 39 నాటౌట్. కీలక ఇన్నింగ్స్ ను ఆడాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సెంచరీ సాధించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version