ఇవాళ్టి నుంచే యాషెస్ పోరు.. సమరానికి ఇంగ్లండ్, ఆసీస్ సై..!

-

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 1882లోనే యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. మనకు, పాకిస్థాన్ దేశానికి మధ్య క్రికెట్ మ్యాచులు జరిగితే ఎంత ఉత్కంఠ కలుగుతుందో.. అదే లాంటి స్థితి ఆ రెండు దేశాల అభిమానులకు కూడా ఎదురవుతుంది.

క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఎంతగానో ఎంజాయ్ చేసిన అభిమానులకు ఇకపై యాషెస్ సిరీస్ వినోదం పంచనుంది. గురువారం నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. అలాగే ఈ సిరీస్‌తో ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ కూడా మొదలవుతోంది. దీంతో క్రికెట్ అభిమానులందరూ నేటి నుంచి జరగనున్న యాషెస్ మ్యాచ్‌లను ఆసక్తిగా తిలకించేందుకు ఎదురు చూస్తున్నారు.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 1882లోనే యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. మనకు, పాకిస్థాన్ దేశానికి మధ్య క్రికెట్ మ్యాచులు జరిగితే ఎంత ఉత్కంఠ కలుగుతుందో.. అదే లాంటి స్థితి ఆ రెండు దేశాల అభిమానులకు కూడా ఎదురవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మొత్తం 70 యాషెస్ సిరీస్‌లు జరగ్గా వాటిల్లో ఆస్ట్రేలియా 33 సార్లు, ఇంగ్లండ్ 32 సార్లు విజయం సాధించింది. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్‌లో దాదాపుగా ఇరు జట్లు సమ ఉజ్జీలుగానే నిలుస్తూ వస్తున్నాయి.

గత యాషెస్ సిరీస్ (2017-18) ఆస్ట్రేలియాలో జరగ్గా అందులో ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం ఇంగ్లండ్‌లో ఈ సిరీస్ జరుగుతోంది. దీంతో ఈ సారి ఎలాగైనా యాషెస్‌ను దక్కించుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఎందుకంటే.. గత 18 ఏళ్లుగా ఆస్ట్రేలియా తమ దేశంలో జరిగిన యాషెస్ సిరీస్‌లోనే విజయం సాధిస్తూ వస్తోంది. కానీ ఇంగ్లండ్‌లో యాషెస్ అయితే ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా గెలవలేకపోతోంది. దీంతో ఇంగ్లండ్ మరోసారి ఆ రికార్డును నిలబెట్టుకోవాలని చూస్తుండగా, ఈసారి ఎలాగైనా సరే ఇంగ్లండ్‌లో యాషెస్ నెగ్గాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది.

గురువారం ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. ఈ క్రమంలో రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 14 నుంచి 18 వరకు (లార్డ్స్ మైదానం), మూడో టెస్ట్ ఆగస్టు 22 నుంచి 26 వరకు (లీడ్స్), నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు (మాంచెస్టర్), ఐదవ టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 12 నుంచి 16వ తేదీ వరకు (ది ఓవల్) జరగనున్నాయి. అయితే ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్న యాషెస్ సిరీస్‌తోనే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ కూడా మొదలుకానుంది. మరి.. అందులో విజేతలుగా ఎవరు నిలుస్తారో చూడాలి..!

యాషెస్ సిరీస్ జట్ల వివరాలు…

ఇంగ్లండ్ (కన్ఫామ్డ్ ఎలెవెన్): జేసన్ రాయ్, రోరీ బర్న్స్, జో రూట్ (కెప్టెన్), జో డెన్లీ, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.

ఆస్ట్రేలియా (ప్రాబబుల్ ఎలెవెన్): డేవిడ్ వార్నర్, కేమరాన్ బ్యాన్‌క్రాఫ్ట్, ఉస్మార్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రేవిస్ హెడ్, మాథ్యూ వేడ్, టిమ్ పైన్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్యాట్ కమ్మిన్స్, జేమ్స్ ప్యాటిన్సన్, పీటర్ సిడిల్, నాథన్ లయాన్.

నోట్: యాషెస్ టెస్టు మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి. సోనీ నెట్‌వర్క్ చానల్స్‌లో యాషెస్ సిరీస్‌ను వీక్షించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version