భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ల తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయిన భారత్ 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (76), శుభమన్ గిల్ (14) పరుగులతో ఉన్నారు. భారత్ తొలి వికెట్ రోహిత్ శర్మ(24) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 64.3 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇక ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 23 ఓవర్లు ఆడి 119 పరుగులు సాధించింది. మరో 127 పరుగులు సాధిస్తే భారత్ తొలి ఇన్నింగ్స్ లో పై చేయి సాధిస్తుంది. భారత్ బౌలింగ్ లో అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, అక్సర్ పటేల్ చెరో 2 వికెట్లను తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో బెన్ స్టోక్స్ (70) పరుగులు అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. బెయిల్ స్టో (37), డుక్కెట్ (35) రూట్ (29) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలింగ్ లో జాక్ లీచ్ రోహిత్ శర్మను ఔట్ చేశాడు.