పవర్ కపుల్ అనగానే ప్రతి ఒక్కరి మదిలో గుర్తొచ్చే జంట విరుష్క. అదేనండి ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. ఈ జంట ఎప్పుడు కలిసి కనిపించినా ఇటు మీడియాకు, అటు అభిమానులకు పండగే. ఇక వీరిద్దరికి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. ఈ జంట పోస్టు పెడితే క్షణాల్లో వైరల్ అవ్వడం ఖాయం. లక్షల్లో లైకులు.. వేలల్లో షేర్లు పక్కా.
అయితే ఈ జోడీ తమ పాపులారిటీని కేవలం డబ్బు సంపాదన కోసమే వినియోగించడం లేదు. సమాజ సేవకు కూడా ఉపయోగిస్తోంది. ఇప్పటికే పలు ఎన్జీవోలతో కలిసి ఈ జంట పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విరుష్క మరో కొత్త ఎన్జీవోకు శ్రీకారం చుట్టింది. ‘సేవ (ఎస్‌ఈవీవీఏ)’ పేరుతో ఓ ఎన్జీవోను స్థాపించింది. అనుష్క శర్మ ఫౌండేషన్, విరాట్ కోహ్లి ఫౌండేషన్‌ను విలీనం చేసి ఈ కొత్త ఎన్జీవోకు శ్రీకారం చుట్టారు.
‘‘మేము సేవ (ఎస్‌ఈవీవీఏ) ఎన్జీవోకు శ్రీకారం చుట్టాం. ఎస్‌ఈ అంటే సెల్ఫ్ (స్వీయ), వీ అంటే విరాట్, వీ అంటే వామిక, ఏ అంటే అనుష్క అనేది దీని అర్థం. మాకు సాధ్యమైన మార్గంలో సేవ చేస్తూనే ఉంటాం. ఒక్కటిగా, ఓ కుటుంబంగా.. మేం జీవించే ఈ ప్రపంచం అనే కుటుంబం కోసమే ఇది’’ అని విరాట్, అనుష్క సామాజిక మాధ్యమాల్లో తెలిపారు.
So, with our heads bowed in gratitude we are offering SeVVA – our joint non-profit which stands for Se (of Self), V (of Virat), V (of Vamika) A (of Anushka). As Seva is always from self of self.
— Anushka Sharma (@AnushkaSharma) March 23, 2023