ఫోన్ చేసినా.. ధోని లిఫ్ట్ చేయడు..కోహ్లీ సంచలనం

-

ఫోన్ చేసినా.. ధోని లిఫ్ట్ చేయడు..కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా MS ధోనితో తనకున్న అనుబంధం గురించి విరాట్ కోహ్లీ మరోసారి స్పందించారు. ‘ఫామ్ కోల్పోయి క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ధోని ఒక్కడే నాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి అండగా నిలిచారు. ఎప్పుడైనా కాల్ చేస్తే 99% ఫోన్ ఎత్తరు. అలాంటి వ్యక్తి స్వయంగా నాకు మెసేజ్ చేశారు.

విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన చేసిన మెసేజ్ నా మనసును తాకింది. నేను కెప్టెన్సీ వదులుకున్న సమయంలోను ధోని మెసేజ్ చేశారు’ అని కోహ్లీ వివరించారు. ఫెయిల్యూర్ కెప్టెన్‌గా నాపై ముద్ర వేశారని తెలిపారు విరాట్‌ కోహ్లీ. రికార్డుల రారాజు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తనపై కొందరు విశ్లేషకులు, అభిమానులు ఫెయిల్యూర్ కెప్టెన్ అనే ముద్రవేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘గెలవడం కోసం టోర్నీలు ఆడతాం. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 WC, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, T20 WC లలో జట్టును సెమీ ఫైనల్స్ వరకు తీసుకెళ్లినా, ట్రోఫీలు గెలవకపోవడంతో నాపై ఫెయిల్యూర్ కెప్టెన్ గా ముద్ర వేశారు. వాటిని నేను పట్టించుకోలేదు’ అని కోహ్లీ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version