Virat Kohli : కొత్త బిజినెస్ లోకి విరాట్ కోహ్లీ !

-

గత కొన్ని రోజులుగా ఫామ్‌ లేక బాధ పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆసియా కప్‌ 2022 లో పికప్‌ అందుకున్నాడు. హాంకాంగ్‌ జట్టుపై క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడి.. టచ్‌ లోకి వచ్చాడు. అయితే.. ఆసియా కప్ 2022 లో బిజీగా ఉన్న టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ త్వరలోనే రెస్టారెంట్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ముంబై ప్రాంతంలో బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

కిషోర్ కుమార్ కు చెందిన బంగ్లాలోని ‘గౌరీ కుంజ్’ పోర్షన్ ను విరుష్క దంపతులు ఐదేళ్లపాటు లీజుకు తీసుకొనున్నారు. కాగా విరాట్ కోహ్లీ తన జెర్సీ నంబర్ 18 ను వన్ 8 కమ్యూన్ పేరిట తన స్వస్థలం ఢిల్లీతో పాటు కోల్కతా, పూనేలో రెస్ట్రోబార్సు ఏర్పాటు చేశాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో, “జూహు, ముంబై, కమింగ్ సూన్” అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి లీజు, ఇతర పనులను కోహ్లీ లీగల్ ఆదారిటీ సెల్ దగ్గరుండి పర్యవేక్షించనుంది. కోహ్లీ ప్రారంభించబోయే రెస్టారెంట్ పై త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version