WI vs Ind : టీ 20 నేడే విండీస్, ఇండియా… కెప్టెన్ గా రోహిత్

-

విండీస్‌ పై వన్డే సిరీస్‌ ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇవాళ్టి నుంచి మరో రసవత్తర పోరుకు రెడీ అయిపోయింది. ఇవాళ విండీస్, ఇండియా మధ్య టీ 20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ్టి టీ 20 మ్యాచ్‌ కు రోహిత్‌ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ మొదటి టీ 20 మ్యాచ్‌ బ్రియాన్ లారా స్టేడియంవేదికగా జరుగనుండగా.. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

జట్ల అంచనా

వెస్టిండీస్‌ : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, ఓడియన్ స్మిత్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్ మరియు హేడెన్ వాల్ష్ జూనియర్/అల్జారీ జోసెఫ్

ఇండియా : రోహిత్ శర్మ (సి), రిషబ్ పంత్, దీపక్ హుడా / శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, ఆర్ అశ్విన్ / కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version