రేపు చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్ సీజన్ 16 ఫైనల్ ను చూడడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు సుదీర్ఘమైన ఐపీఎల్ అనుభవం ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కాగా, ఐపీఎల్ లో అడుగు పెట్టిన మొదటి సీజన్ లోనే కప్ ను సొంతం చేసుకుంది. ఇపుడు రెండవసారి కప్ ను కొట్టడానికి సిద్ధంగా ఉంది గుజరాత్ టైటాన్స్. కాగా ధోని ఇప్పటి వరకు చెన్నై ను దీనితో పాటు 10 సార్లు ఫైనల్ కు చేర్చాడు. అయితే కేవలం నాలుగు సార్లు మాత్రమే టైటిల్ ను గెలుచుకోగలిగాడు. ఇప్పుడు అయిదవ సారి టైటిల్ కొట్టడానికి అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకున్నాడు ధోని. ఒకవేళ ఈ సారి చెన్నై టైటిల్ ను గెలిస్తే.. కెప్టెన్ ధోని రిటైర్మెంట్ ఇస్తాడా అన్నది కూడా ప్రచారంలో ఉంది.
ఐపీఎల్ 2023 : చెన్నై టైటిల్ కొడితే.. ధోని రిటైర్మెంట్ ఇచ్చేస్తాడా ?
-