శ్రీ లీల దూకుడు ను అడ్డుకునే హీరోయిన్ లేదు.!

-

ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీ లీల కి యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. తాను సినిమాలు వరసగా చేస్తుండడం వల్ల  తన క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. అందానికి అందం, చలాకి తనం, డాన్స్ తో కుర్రాళ్ళు ను థియేటర్స్ కు వచ్చేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా రవితేజ తో చేసిన ధమాకా సినిమా  రికార్డ్ వసూళ్ళు కొల్ల గొడుతోంది.

ప్రస్తుతం అమ్మడి చేతిలో ఇప్పటికిప్పుడు 6 సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే రోజుకు 48 గంటలు ఉన్నా కూడా సరిపోయే పరిస్తితి లేదు. ఈమె యవ్వారం చూసిన రవితేజ ఆమెతో నెక్స్ట్ సినిమా కు నాకు డేట్స్ దొరికేలా లేవు అని అన్నాడంటే ఆమె పాపులారిటీ అలా ఉంది. ఇక రీసెంట్ గా రెమ్యునరేషన్ కూడా డబుల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

సినిమాల తో పాటు  సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో  పద్ధతిగా ఉండే డ్రెస్సులు తో మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక అమ్మడి దూకుడు ను అడ్డుకునే అందగత్తె ప్రస్తుతం ఎవరూ కనపడటం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version