శ్రీలంక ప్రధాని రాజీనామా..

-

గత నెలరోజుల నుంచి శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను తాకాయి. రాజపక్సే రాజీనామా చేయాలని గత కొంతకాలంగా శ్రీలంక లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కాగా ఎట్టకేలకు శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు.” శ్రీలంక ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు.. భావోద్వేగాలకు ఇది సమయం కాదు… హింస మరింత హింసను ప్రేరేపిస్తుంది. ఆర్థిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుంది అంటూ రాజీనామాకు ముందు ట్వీట్ చేశారు మహీంద్ర రాజపక్సే.

నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగడంతో సోమవారం స్థానిక పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. మరోవైపు దేశ రాజధాని కొలంబోలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి అధ్యక్ష కార్యాలయం బయట నిరసన తెలుపుతున్న వారిపై రాజపక్సే విధేయులు సోమవారం కర్రలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న టెంటు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయడానికి యత్నించడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని రాజపక్సే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version