భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ అనుకున్నంత లేదు… శ్రీ రెడ్డి..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో భీమ్లా నాయక్ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ ల కొద్దీ వ్యూస్ ను సాధిస్తూ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇలా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ పై శ్రీ రెడ్డి స్పందించింది. ఇది వరకే శ్రీ రెడ్డి ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన అనేక విషయాల్లో స్పందించిన విషయం మనకు తెలిసిందే.

శ్రీ రెడ్డి తాజాగా కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ పై స్పందించింది. శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ… భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ అనుకున్నంత లేదంటూ నెగెటివ్ కామెంట్ లను చేసింది. అది మాత్రమే కాకుండా భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ బిలో యావరేజ్ గా ఉంది అంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ ను ఉద్దేశించి శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version