మండలిలో శ్రీధర్ బాబు వర్సెస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు..

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. మంగళవారం శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఎమ్మెల్సీ చేసిన కామెంట్స్ పై మంత్రి అభ్యంతరం తెలిపారు. ప్రశ్నోత్తరాల టైంలో ఫ్యూచర్ సిటీపై ప్రశ్న సందర్భంగా.. ఫోర్త్ సిటీ కాదు, ఫోర్ బ్రదర్స్ సిటీ కడుతున్నారని శంభీపూర్ రాజు అనగా..

మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తాను ఎవరి పేరు తీసుకురాలేదని.. శాసనసభలో అంతకన్నా దారుణంగా వ్యాఖ్యానిస్తున్నారని.. బట్టలూడదీసి, ఉరికించి కొడతామని స్వయంగా సీఎం మాట్లాడరని ఎమ్మెల్సీ రాజు చెప్పారు. అధికార పార్టీకి ఓ చట్టం, నాకు మరో చట్టం ఉందా? అని ప్రశ్నించారు. అనంతరం చైర్మన్ కలుగజేసుకుని బయట హౌస్ గురించి ఇక్కడ మాట్లాడొద్దని హితవు పలికారు. రాజు శాసనసభకు వస్తే అలాంటి వ్యాఖ్యలు చూపిస్తామని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version