నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం “భగవంత్ కేసరి”. ఇందులో బాలకృష్ణతో పాటుగా కాజల్ అగర్వాల్, శ్రీలీల మరియు ఇతర తారాగణం నటిస్తున్నారు. కాగా ఇటీవల భగవంత్ కేసరి సినిమా నుండి ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో బాలకృష్ణ మరియు శ్రీలీలలు బాబాయ్ కూతురిలా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కాగా ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, బాలయ్య నాకు ఎందుకో నిజమైన బాబాయ్ లాగానే అనిపిస్తున్నాడు, అంతలా మాతో కలిసిపోయాడు అంటూ శ్రీలీల చెప్పింది. ఇంకా బాలకృష్ణ గురించి మళ్లాడుతూ ఆయన సెట్ లో అందరికీ ఎంతో గౌరవం ఇస్తారన్నారు శ్రీలీల. బాలయ్యల అందరితో జోక్స్ వేస్తూ మాట్లాడుతారు, కానీ షాట్ రెడీ అవ్వగానే భగవంత్ కేసరి లా మారిపోతారు.
అంతలా నటనకు గౌరవం ఇచ్చి పాత్రలో లీనం అవుతారు అంటూ ఆయనతో అనుభవాన్ని చెప్పుకొచ్చింది శ్రీలీల. మరో అవకాశం వస్తే బాలయ్య తో ఇంకో సినిమా చెయ్యాలను ఉందంటూ తన మనసులోని కోరికను తెలిపింది.