టీవీ యాంకర్ శ్రీముఖికి స్టార్ హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్, పాపులారిటీ ఉన్నాయి. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఆడపదడపా సినిమాల్లోనూ కనిపిస్తున్నారు.
అయితే, ఆమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం టెలివిజన్ రంగమే. కామెడీ, డ్యాన్స్ షోలతో పాటు బడా బడా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఆమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో 4.6 మిలియన్ ఫాలోవర్లు శ్రీముఖికి ఉన్నారు.
వారి కోసం నిత్యం ఇన్స్టా లో శ్రీముఖి ఫోటోలు, వీడియోలు పెడుతుంటారు. ముఖ్యంగా శ్రీముఖి పోస్ట్ చేసే ఫోటోషూట్ లు అభిమానులను కట్టిపడేస్తుంటాయి.