బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి. ఓ వైపు టెలివజన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ పైన కూడా మెరుస్తుంటుంది. ఇకపోతే స్పెషల్ ఈవెంట్స్ లో శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు. తన అద్భుతమైన యాంకరింగ్ స్కిల్స్ తో అందరిని అలరించే ఈ భామ.. తనదైన స్టైల్ లో ‘రాములమ్మ’ స్టెప్పులు వేయడంతో పాటు పంచులు వేసి నవ్వులు పూయిస్తుంది.
ఈ భామ జీతెలుగు వారి ‘సరిగమప : సూపర్ సింగింగ్ సూపర్ స్టార్’ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందులో ఉగాది సందర్భంగా చేయబోయే స్పెషల్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి అందంగా ముస్తాబైంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది ఈ భామ. సదరు ఫొటోల్లో శ్రీముఖి చాలా అందంగా కనబడుతోంది. సంప్రదాయానికి ప్రతీక అయిన లంగావోణిలో మెరిసిపోతున్నది.
రెడ్ కలర్ హాఫ్ శారీలో మ్యాచింగ్ ఆభరణాలు, గాజులు ధరించి కొప్పులో మల్లె పూలు పెట్టుకుని అలా నడుముపైన చేయి వాల్చి, ఓరగా చూస్తూ, కొంగు సర్దుకుంటూ రకరకాల ఫోజులిచ్చింది. ఆ ఫొటోలన్నిటినీ చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బొద్దుగా ముద్దుగా శ్రీముఖి ముద్దొచ్చేలా ఉందని అంటున్నారు. ‘క్యూట్ రాములమ్మ, సూపర్ గార్జియస్, లవ్లీ, సూపర్ అక్క, లవ్ యూ’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.