యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా పలు రికార్డులను తిరగరాస్తుంది. బహుబలి రికార్డులను కూడా బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ ఆర్ఆర్ఆర్ సినిమా దూసుకువెళ్తుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పవర్ ఫుల్ గా కనిపించింది.
కాగ ఆర్ఆర్ఆర్ విడుదల కు ముందు నుంచే తారక్ ను అభిమానులు.. సీఎం… సీఎం అంటూ నినాదాలు ఇస్తున్నారు. థీయేటర్ లలో, ఈవెంట్ లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి.. సీఎం.. సీఎం అనే నినాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజుల నుంచి తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చ నడుస్తుంది. అయితే తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం తనకు యాక్టింగ్.. సంతోషం ఇస్తుందని అన్నారు. తను భవిష్యత్తు గురించి ఆలోచించనని అన్నారు. రాబోయే సెకన్ గురించి మాత్రమే ఆలోచిస్తానని అన్నారు. తాను సినిమా రంగంలోనే ఉంటానని తెల్చి చెప్పారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి వస్తున్న వార్తులకు చెక్ పడింది.