తెలంగాణ నేతలను బిచ్చగాళ్ళ లాగా కేంద్రం చూస్తుంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీ ల కోసం వెళతారని… తాము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామని పేర్కొన్నారు. అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు… తెలంగాణ నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోందని మండిపడ్డారు.

బీజేపీ నేతలు ఢిల్లీ లో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం తమ పెద్దలతో మాట్లా డుతున్నారని.. ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం భాద్యతే దాన్నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతాం. చెడు చేస్తే దానికి తగ్గట్టే వ్యవహరిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ మీద కోపం, అధికార దాహంతో బీజేపీ తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆగ్రహించారు. కేసీఆర్ మరోసారి అధికారం లోకి రాకూడదని.. బీజేపీ నేతలు కుట్ర పన్నారని …వారి కుట్రలను ఛేదిస్తామని హెచ్చరించారు. బీజేపీ ని ఎదుర్కోవడానికి మా వ్యూహం మాకుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version