కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో SSC CHSL (10+2) ఉద్యోగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా SSC CHSL (10+2) పోస్టుల్లో దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అలానే దరఖాస్తుల్లో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులను మే 10, 11 తేదీల్లో ఎడిట్ చూసుకునేలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది.కాగా లోయర్ డివిజన్ క్లర్క్, డీఈవో, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 3712 పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను SSC వెబ్సైట్లో పొందుపరిచింది.