బెంగళూరులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు

-

ఒకవైపు నీటి కొరత.. ఇంకోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నా టెక్ సిటీ బెంగళూరు భారీ వర్షంతో తడిసిముద్దైంది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది.. దీంతో బెంగళూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా నీటి కొరతతో ప్రతి రోజూ తాగునీటి కష్టాలను ఎదుర్కొంటూనే బెంగళూరు ప్రజలు సోమవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంకోవైపు ఎండ వేడిమి నుంచి కూడా ఉపశమనం పొందుతు.. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పడడంతో వీధుల్లోకి వచ్చి విహరిస్తున్నారు.

ఈ ఏడాది తాగునీటి సమస్యతో ఎన్నడూలేనంతంగా బెంగళూరు సిటీ అల్లాడిపోయింది. కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరకక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బోరు బావులు ఎండిపోవడం.. బయట నీళ్లు లభించక అష్టకష్టాలు పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version