పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల పెద్దగా కనపడలేదు. వరుసగా రెండో రోజు ఏ మార్పు కనపడక పోవడం అనేది. అయితే నగరాల్లో ధరలు ఏ మాత్రం పెరగలేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కొద్దిగా వుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ధరలు విషయం లోకి వచ్చేస్తే.. దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 92.85 గా వుంది. గురువారం కూడ ధరలు ఇలానే వున్నాయి. అదే విధంగా డీజిల్ ధర రూ. 83.51 వద్దనే వుంది. ఇది ఇలా ఉండగా దేశ రాజధాని ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏ మాత్రం మార్పు లేదు.
శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 99.14 గా ఉంటే, డీజిల్ రూ. 90.71 గా ఉంది. బెంగళూరులోనూ ఇంధన ధరల్లో మార్పు లేదు. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.95.94 గా ఉండగా డీజిల్ ధర రూ. 88.53 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరల్ని చూస్తే.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.50 గా ఉండగా, డీజిల్ ధర రూ. 91.04 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో మాత్రం కాస్త మార్పు వుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 99.28గా వుంది. కానీ గురువారం రూ. 98.97 గా వుంది. డీజిల్ మాత్రం రూ. 93.23 వద్ద కొనసాగుతోంది. విశాఖ లో లీటర్ పెట్రోల్ రూ. 98.50 గా ఉండగా డీజిల్ రూ. 92.46 వద్ద కొనసాగుతోంది. పెరుగుదల ఇక్కడ లేదు.