స్టేట్ బ్యాంకు గుడ్ న్యూస్…!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో హోమ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ తీసుకుని ఈఎమ్ఐ లు చెల్లిస్తున్నవారికి ఒక మంచి కబురు వచ్చింది. అదేంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను 0.35% తగ్గించింది.

దీని వల్ల ఈఎంఐలు తగ్గనున్నాయి. ఎస్‌బీఐలో హోమ్ లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాలకు ఇది వర్తిస్తుంది. అన్ని కాలవ్యవధుల రుణాలకు ఇది వర్తించనుంది. కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఏడాది ఎంసీఎల్ఆర్ 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ వడ్డీని తగ్గించడం ఇది 11వ సారి. కొత్త వడ్డీ రేట్లు 2020 ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తాయి. హోమ్ లోన్ కస్టమర్లకు 30 ఏళ్ల లోన్‌పైన రూ.1,00,000 పై రూ.24 చొప్పున ఈఎంఐ తగ్గుతుంది. అయితే ఎంసీఎల్ఆర్‌తో లింక్ చేసిన లోన్లు తీసుకున్న వారికే ఇది వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version