దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో సేవలని అందిస్తోంది. అయితే ఇప్పుడు ఖాతాదారులను అలర్ట్ చేసింది. అదేమిటంటే…? అంతర్జాతీయ లావాదేవీలను కొనసాగించాలనుకుంటే తప్పకుండ మీ బ్యాంకు ఖాతాతో మీ పాన్(PAN) నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని స్వయంగా ఎస్‌బీఐ తెలిపింది. ఇలా చెయ్యకపోతే అంతర్జాతీయ లావాదేవీలను చేసేటప్పుడు అంతరాయం కలగొచ్చు. మీరు కనుక మీ బ్యాంకు ఖాతాతో మీ పాన్(PAN) నంబర్‌ను లింక్ చేసుకోవాలి అంటే బ్యాంక్ కి వెళ్ళక్కర్లేదు. కేవలం ఇంట్లోనో, ఆఫీసు లోను కూర్చుని సులువుగా చేసేసుకోవచ్చు.
తర్వాత మీ అకౌంట్ వివరాలు కనపడతాయి. ‘Click here to register’ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ అకౌంట్‌కు పాన్(PAN) లింక్ చేయాలో దానిని క్లిక్ చేసాక పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ చెయ్యండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మీ పేరు, CIF మరియు పాన్ నంబర్ కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసి కన్ఫార్మ్ చెయ్యండి. వెరిఫికేషన్ కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు హై సెక్యూరిటీ కోడ్ అందుతుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫార్మ్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి. స్క్రీన్‌పై మీ రిక్వెస్ట్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. బ్యాంక్ మీ రిక్వెస్ట్‌ను 7 రోజుల్లో ప్రాసెస్ చేస్తుంది.