గాంధీ ఆస్ప‌త్రికి రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

-

రాష్ట్రంలో రోజు రోజుకు క‌రోనా వ్యాప్తి పెర‌గుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లోని సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో నేటి నుంచి ఎమ‌ర్జెన్సీ కానీ ఆప‌రేష‌న్లను నిలిపివేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వుల‌ను సైతం విడుద‌ల చేసింది. దీంతో గాంధీ ఆస్ప‌త్రిలో అత్య‌వ‌స‌రం కాని ఆప‌రేష‌న్లు జ‌ర‌గ‌వు. అయితే రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే గాంధీ ఆస్ప‌త్రిలో అత్య‌వ‌స‌ర ఆప‌రేష‌న్లకు మాత్రం ఎలాంటి ఆట‌కం ఉండ‌ద‌ని తెలిపింది.

గాంధీ ఆస్ప‌త్రిలో ఇక నుంచి క‌రోనా సోకిన వ్య‌క్తుల‌కు చికిత్స అందించ‌డానికి వినియోగించే అవ‌కాశం ఉంది. అలాగే గాంధీ ఆస్ప‌త్రిలో బెడ్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబ‌ట్టి క‌రోనా కేసులు పెరిగిన స‌మ‌యాల్లో అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో దీనిని ఉపయోగించు కోవ‌చ్చని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. కాగ రాష్ట్రంలో క‌రోనా కేసులు ఈ మ‌ధ్య కాలంలో విప‌రీతంగా న‌మోదు అవుతున్నాయి. ఈ రోజు 1,920 కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే సోమ వారం 1,825 కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే గ‌త కొద్ది రోజుల ముందు ఏకంగా 2,000 ల‌కు పైగా కేసులు వెలుగు చూశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version