రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి
ఎలాంటి ఖర్చు లేకుండా సామాన్యుడు సైతం ఆడగలిగే అచ్చమైన గ్రామీణ క్రీడ కబడ్డీ అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం కొండపాక వేద పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల కబడ్డీ క్రీడకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరిగింది.. దీంతో తెలంగాణ ప్రభుత్వం కబడ్డీ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. అన్ని పాఠశాలల్లో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామి ఇచ్చారు. సిద్దపేట జిల్లా నుంచి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అటలను మరిచిపోయారు, మైదానంలో ఆడాల్సిన ఆటలను మొబైల్లో ఆడుతున్నారని దీంతో వారు క్రీడాస్ఫూర్తిని పొందలేరని గుర్తుచేశారు. క్రీడల వల్ల మానసికోల్లాసం కలుగుతుందని తెలిపారు.