రియల్ లైఫ్ లో ఎలాంటి గొడవలు లేకుండా జీవిస్తున్న అక్కినేని నాగ చైతన్య, సమంతలు రీల్ లైఫ్ లో మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడేలా పరిస్థితులు కనబడుతున్నాయి. నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా అసలైతే ఆగష్టు 31న రిలీజ్ కావాల్సి ఉంది. కాని కేరళ వరదల వల్ల ఆ సినిమా దర్శకుడు సినిమాకు ఆర్.ఆర్ అందించడం లేట్ అవుతుంది అందుకే సెప్టెంబర్ 13కి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడ్డది.
ఇదిలాఉంటే అదే రోజు సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు యూటర్న్ చిత్ర దర్శక నిర్మాతలు. కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమాను ఏరి కోరి మరి సమంత లీడ్ రోల్ చేసింది. సినిమా యూనిట్ మొత్తం చైతుకి కావాల్సిన వారే కాని ఈ సినిమా ముందే సెప్టెంబర్ 13 రిలీజ్ అని చెప్పడంతో శైలజా రెడ్డి అల్లుడికి పోటీ తప్పేలా లేదు.
రెండు సినిమాల్లో శైలజా రెడ్డి అల్లుడు వెనక్కి తగ్గదు కాబట్టి సమంత యూటర్న్ సినిమానే మరో టర్న్ తీసుకుని వాయిదా వేసుకోవాలి. అది కాదు కూడదు అంటే మాత్రం సమంత కూడా చైతు శైలజా రెడ్డి అల్లుడితో పోటీపడాల్సిందే. మరి భర్తతో ఈ రీల్ ఫైట్ కు సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.