స్టీమ్డ్ క్యారెట్ కేక్.. కంటి మసకని తగ్గించి చూపు పెంచుతుంది.!

-

క్యారెట్ మన ఆరోగ్యానికి అందానికి ఎంత మంచిదో మనకు తెలుసు.. కానీ క్యారెట్ తో ఏది ఎక్కువగా తినబుద్దికాదు. కర్రీ ఎక్కువ తినలేరు. పచ్చిదితినబుద్ది కాదు. మరి క్యారెట్ ను టెస్టీగా ఎలా తినాలి.. అవునూ.. మీకు కేక్ ఇష్టమేనా.. ఉండే ఉంటుంది కదా.. క్యారెట్ తో కేక్ చేస్తే.. పిల్లల అయితే ఎగిరి గంతేస్తారు. మాములు కేకు అయితే.. పెద్దలు ఎక్కువ తిననివ్వరు. ఈ కేక్ అయితే ఎంతైనా తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. స్టీమ్డ్ క్యారెట్ కేక్ ఎలా చేయాలో చూద్దాం.

 

ఉడికించిన క్యారెట్ కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు

క్యారెట్ ముక్కులు ఒకటిన్నర కప్పు
పాలు 250mL
తెల్లబియ్యం పిండి ఒక కప్పు
తేనె ఒక కప్పు
జాజికాయ పౌడర్ కొద్దిగా

తయారు చేసే విధానం..

చిన్నసైజ్ ప్రజర్ కుక్కర్ తీసుకుని కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి పాలు పోసీ రెండు విజల్స్ వచ్చే వరకూ ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాతా వాటిని మిక్సీజార్ లో వేసి మెత్తగా పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేయండి. అందులోనే తేనె, బియ్యంపిండి, జాజికాయ పొడి వేసి మరొకసారి గ్రైండ్ చేయండి. దాన్ని తీసుకుని కేక్ ట్రేలో.. అడుగున మీగడ రాసి ఈ మిశ్రమం వేయండి. మందపాటి అల్యూమినియం పాత్రలో నీళ్లు పోసి.. ఇది బేక్ చేయండి.. ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందలో కప్పు బియ్యంపిండి, తేనె, పాలు పోసి కలపండి. పదినిమిషాలు క్యారెట్ ఉడికిన తర్వాత..ఈ బియ్యంపిండి కలిపిన పిండిన కూడా పైన లేయర్ లా వేయండి. మూతపెట్టి మరొక పది నిమిషాలు ఉడకినవ్వండి. అంతే టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ కేక్ రెడీ.. చిన్నపిల్లకు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మంచి పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి.. ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇది చిన్న పిల్లలకే కాదు.. పెద్దలు కూడా తినొచ్చు. ఎప్పుడూ జ్యూస్ లు, హల్వాలానే క్యారెట్ ను వాడుతుంటారు. ఈ సారి ఇలా ట్రే చేయండి. కంటి సమస్యలు కూడా క్యారెట్ వల్ల ఎలాగూ తగ్గుతాయి అని మనకు తెలిసిందే.. వారానికి ఓ సారి ఇలా చేసుకుని తింటే చాలు..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version